ఓయూలో హాస్టల్ విద్యార్ధుల అందోళన.
జనం వాయిస్, హైదరాబాద్:
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని హాస్టల్ సిబ్బంది అవమానించిందని విద్యార్ధులు అందోళనకు దిగారు. బుధవారం రాత్రి నుండి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తీరుకు నిరసనగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసారు. పిల్లలను చూడటానికి వచ్చిన విద్యార్థిని తల్లి రాత్రి అవ్వడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు వెళ్తామని అనడంతో.. ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోవాల్సిందే అంటూ సిబ్బంది చెప్పారు. దీంతో విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కు దిగారు.