janamvoice.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 10:23 am Digital Edition : GATTU MAHESH

వాహనాలపై అలాంటి స్టిక్కర్లు వేస్తే..

వాహనాలపై అలాంటి స్టిక్కర్లు వేస్తే..

జనం వాయిస్, వెబ్ డెస్క్:

వాహనాలపై పోలీస్, ప్రెస్, అడ్వకేట్ వంటి వివిధ హోదాల స్టిక్కర్ల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని I&PR స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. నంబర్ ప్లేట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని హెచ్చరించారు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే పదాన్ని ఉపయోగించాలన్నారు.