మంథనిలో గంజాయి అక్రమ రవాణ.
-ముగ్గురు యువకులను అరెస్టు చేసిన మంథని పోలీసులు.
జనం వాయిస్, మంథని, మార్చి 17:
మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గాడుదలగండి ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో గంజాయి అక్రమ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది. మంథని ఎస్సై డి. రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, ఆదేశ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, వారి వద్ద నుండి సుమారు 120 గ్రాముల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయినా వారిలో చందు సంతోష్ (తండ్రి: లక్ష్మణ్), గోపాలపూర్, కోల శ్రావణ్ (తండ్రి: కేశవ్), చింతకాని, కాటారం మండలం, అల్లెం అరుణ్ (తండ్రి: తిరుపతి), చింతకాని, కాటారం మండలం కు చెందిన వారీగా తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.