ఉత్కంఠ సమరంలో భారత్ విజయం

ఉత్కంఠ సమరంలో భారత్ విజయం జనం వాయిస్, స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఇరవై ఓవర్ల ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో చివరి వరకూ విజయం దోబూచులాడినా, ఒత్తిడిని జయించిన భారత జట్టు గెలుపు గడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్యఛేదనకు...