అమెరికాపై భారత ఘన విజయం. తొలిమ్యాచ్‌లోనే ధీటైన ఆరంభం.
అమెరికాపై భారత ఘన విజయం. తొలిమ్యాచ్‌లోనే ధీటైన ఆరంభం. జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్: పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి లీగ్ మ్యాచ్‌లో అమెరికా జట్టును ఎదుర్కొన్న భారత్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ ఆధిపత్యం చాటుతూ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోగా అమెరికా బ్యాటర్లు భారత పేస్ దళం దెబ్బకు ఆరంభంలోనే కుప్పకూలారు. తొలి మూడు వికెట్లు కేవలం 29 పరుగులకే కోల్పోయిన అమెరికా జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది....