జాబ్ నోటిఫికేషన్ల కోసం మేడారం జాతరలో నిరుద్యోగుల వినూత్న నిరసన.
జాబ్ నోటిఫికేషన్ల కోసం మేడారం జాతరలో నిరుద్యోగుల వినూత్న నిరసన.- షాపు ఏర్పాటు చేసి బ్యానర్లతో నిరసన.- ఉద్యోగాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు.- సమ్మక్క తల్లిని వేడుకున్న నిరుద్యోగులు.జనం వాయిస్, మేడారం: ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ నిరుద్యోగ యువత మేడారం జాతరలో వినూత్న నిరసన చేపట్టారు. ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోవడంతో ఉపాధి లేక జాతరలో షాపు పెట్టుకున్నామని పేర్కొంటూ, నిరుద్యోగులు బ్యానర్లు ప్రదర్శించారు. ఈ నిరసన భక్తులు, సందర్శకుల దృష్టిని ఆకర్షించింది.ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమతో ప్రభుత్వం...