ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు.
జనం వాయిస్, ముత్తారం:
జాతీయ మత్యకారుల దినోత్సవ సందర్భంగా ముత్తారం మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ కులస్తులు ఘనంగా నిర్వహించారు.జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, ముత్తారం పారుపల్లి గ్రామ సొసైటీ కార్యదర్శి కుక్కల చంద్రమౌళి,కులపెద్ద మనుషులు ఆకుల ఓదెలు,మల్యాల దేవేందర్,అధిక సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.