janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:25 pm Digital Edition : JANAM VOICE

కాటారం సబ్‌ డివిజన్ ఐదు మండలాల్లో  సన్న బియ్యం ఆక్రమణ రవాణా నా?

కాటారం సబ్‌ డివిజన్ ఐదు మండలాల్లో  సన్న బియ్యం ఆక్రమణ రవాణా నా?

సిరంచ కు సన్నబియ్యం తరలిస్తుందెవరు.

జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 23:

కాటారం సబ్‌ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం అక్రమ రవాణాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా సేకరించిన బియ్యాన్ని కాలేశ్వరం అన్నారం బ్యారేజీ రోడ్లు, అంతర్రాష్ట్ర వంతెనల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ మార్గాల ద్వారా పీడీఎస్ బియ్యం రవాణా జరుగుతోందని వార్తలు వెలువడగా, అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహించి బియ్యం స్వాధీనం చేసుకున్న ఘటనలు నమోదయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, కొందరు మధ్యవర్తులు రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు సన్న బియ్యం కొనుగోలు చేసి, రహస్యంగా నిల్వ చేసి, అనంతరం వాహనాల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాలేశ్వరం ఇంటర్‌స్టేట్ బ్రిడ్జి, అన్నారం బ్యారేజీ పరిసర మార్గాల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ రవాణా ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.