మీ ఆధార్ కార్డు సురక్షితంగానే ఉందా..? ఇలా తెలుసుకుంటే నిశ్చింత..!

మీ ఆధార్ కార్డు సురక్షితంగానే ఉందా..? ఇలా తెలుసుకుంటే నిశ్చింత..! జనం వాయిస్, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ అత్యంత కీలకంగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు లావాదేవీలు చేయాలన్నా, సబ్సిడీలు రావాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి అయింది. అయితే ఇదే ఆధార్ వివరాలు అనధికారంగా వాడితే ఆర్థిక నష్టం, వ్యక్తిగత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే మీ ఆధార్ సురక్షితంగా ఉందో లేదో తరచూ పరిశీలించుకోవడం చాలా అవసరం.ఆధార్ భద్రతను తెలుసుకోవడానికి...