హైదరాబాద్ లో వానలే వానలు.

హైదరాబాద్ లో వానలే వానలు. జనం వాయిస్, హైదరాబాద్, జూలై 30: ఉత్తర తెలంగాణ ప్రాంతాలతో పాటు రాజధాని హైదరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కురిసిన కుండపోత వర్షానికి రహదారులు జలమయమై వరద నీరు పొంగిపొర్లింది. దీంతో పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు మంగళవారం రాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా పశ్చిమ-వాయవ్య...