janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 3:13 pm Digital Edition : GATTU MAHESH

రేపు మంథని, పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన.

రేపు మంథని, పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన.

జనం వాయిస్, మంథని, పెద్దపల్లి:

రేపు (సోమవారం)రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని లో పర్యటించనున్నారు.ఉదయం 7:00 గంటలకు మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు.మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు VIATRIS  వారి సౌజన్యంతో 850 కుట్టుమిషన్లతో ALEAP మరియు డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో 21 ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు (మంథని టౌన్ లో 2,మంథని మండలంలోని గుంజపడుగు,సూరయ్య పల్లి,గద్దలపల్లి, గోపాల్ పూర్, వెంకటాపూర్, చిల్లపల్లి, నాగారం, గాజులపల్లి, ఎక్లాస్పూర్, ముత్తారం మండలం….ముత్తారం,అడవి శ్రీరాంపూర్,ఓడేడు…. రామగిరి మండలం -కల్వచర్ల, బేగంపేట్, సుందిళ్ల…. కమాన్పూర్ మండలం, కమాన్పూర్, జూలపల్లి, రొంపి కుంట, పాలకుర్తి రానాపూర్
పై సెంటర్లలో ప్రభుత్వ రైతు వేదికలలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 7:30 నిమిషాలకు మంథని ప్రభుత్వ వైద్యశాలలో CHC లో 12 లక్షలతో స్కానింగ్ మిషన్,2 లక్షలతో RO వాటర్ ప్లాంట్, 1లక్షతో న్యూ OP రూమ్,4లక్షలతో  పేషంట్ వెయిటింగ్ హాల్,1లక్షతో చిన్నపిల్లల వార్మర్స్ ను ప్రారంభోత్సవం చేయనున్నారు.అనంతరం ఉదయం 11-00 గంటలకు పెద్దపల్లి జిల్లాలోని మహిళలకు  ఇందిరా మహిళా శక్తి చీరలను పెద్దపల్లిలోని స్వరూప గార్డెన్ లో మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.