నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహ.-జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్
జనం వాయిస్,పెద్దపల్లి ,నవంబర్ -14:
జిల్లాలోని నిరుద్యోగ యువకులకు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు నవంబర్ 19న బుధవారం రోజున రూమ్ నెంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో మొత్తం 67 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,సేల్స్ ఎగ్జిక్యూటివ్ 60,ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 4,హెచ్ఆర్ 2,ఆఫీస్ బాయ్ 1 పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.సేల్స్ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిగ్రీ ,డిప్లమా,ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ బీఎస్సీ, హెచ్ఆర్ ఉద్యోగాలకు ఎంబీఏ,ఆఫీస్ బాయ్ పోస్ట్ లకు పదవ తరగతి,విద్య అర్హతలు కలిగిన వారు అర్హులు.ఆసక్తి ఉన్నవారు నవంబర్ 19న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో Room No.225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో,పెద్దకాల్వల పెద్దపల్లి మొదటి అంతస్థులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని,మరిన్ని వివరాలకు 9908674056,8985336947,8121262441 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ ఆ ప్రకటనలో తెలిపారు.