నవంబర్ 4న జాబ్ మేళా నిర్వహణ.-జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్.
జనం వాయిస్,పెద్దపల్లి ,అక్టోబర్ 31:
జిల్లాలోని నిరుద్యోగ యువకులకు మెడ్ ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు నవంబర్ 4న మంగళవారం రోజున రూమ్ నెంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.మెడ్ ప్లస్ కంపెనీలో 40 ఫార్మాసిస్టు , 50 ఫార్మాసిస్టు ఏఐడి , 100 జూనియర్ అసిస్టెంట్, 30 ఆడిట్ అసిస్టెంట్, 20 సిఎస్ఏ, 1 డెలీవరి బాయ్, 1 సెక్యూరిటీ గార్డు, 1 హౌస్ మేయిడ్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.ఫార్మాసిస్టు, ఉద్యోగాలకు బి ఫార్మసీ తో పాటు పిసిఐ, ఫార్మాసిస్టు ఏఐడి, జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, డెలీవరి బాయ్, సెక్యూరిటీ గార్డు, హౌస్ మేయిడ్ పోస్ట్ లకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ,డిగ్రీ విద్య అర్హతలు కలిగిన వారు అర్హులు.ఆసక్తి ఉన్నవారు నవంబర్ 4న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో Room No.225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో, పెద్దకాల్వల పెద్దపల్లి మొదటి అంతస్థులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9392310323, 8985336947, 8121262441 ఫోన్ నెంబర్ లో నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ ఆ ప్రకటనలో తెలిపారు.