ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు.
– మున్సిపల్ ఎన్నికల ముందు రోజు రోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ బలం.
– తాజాగా హుజురాబాద్ మున్సిపల్ నుండి పలువురి చేరిక.
జనం వాయిస్, హుజురాబాద్:
మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును బట్టి,హుజూరాబాద్ లో ప్రణవ్ అభివృద్ధికి బాటలు వేస్తుండడం చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు వెల్లడించారు. హుజురాబాద్ పట్టణానికి చెందిన కోయల్కార్ భారతి-బాలాజీ, ఎబివిపి నాయకుడు నాగా సుమన్ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే నిధులు కేటాయించామని రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని ప్రణవ్ తెలిపారు. ఈకార్యక్రమంలోహుజూరాబాద్ మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.