janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 4:23 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణ జాగృతిలో చింతల రాజలింగం చేరిక.

తెలంగాణ జాగృతిలో చింతల రాజలింగం చేరిక.

– ఎస్సీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం.

– పలు కుల సంఘాల నేతల సమక్షంలో కార్యక్రమం.

జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 16:

ఎస్సీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ కార్యక్రమం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జరిగింది. చింతల రాజలింగం గారితో పాటు జిహెచ్ఎంసి పరిధిలోని పలు కుల సంఘాలకు చెందిన నాయకులు కూడా తెలంగాణ జాగృతిలో సభ్యత్వం స్వీకరించారు. సమాజ హక్కులు, సామాజిక న్యాయం కోసం కలిసి పనిచేయాలని వారు తెలిపారు.
తెలంగాణ జాగృతి వేదికగా బలహీన వర్గాల సాధికారత కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. సమాజ అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేరిక కార్యక్రమం సాదరంగా నిర్వహించబడింది. నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని ఐక్యతతో ముందుకు సాగాలని సంకల్పించారు.