అమ్ముడుపోతున్న జర్నలిజం!
అమ్ముడుపోతున్న జర్నలిజం!రాజకీయ పార్టీలకు తలోగ్గుతున్న కొందరి కలాలు.అర్హతలు, అనుభవం లేకున్నా ‘ప్రెస్’ ముసుగులో హల్‌చల్. నిజమైన జర్నలిస్ట్ లకు తప్పని తిప్పలు.జనం వాయిస్, ప్రత్యేక కథనం:ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన జర్నలిజం నేడు పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజల సమస్యలను ప్రశ్నించాల్సిన కలం కొందరి విషయంలో రాజకీయ అనుబంధాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు వేదికగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్న పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వార్తా? రాజకీయ ప్రచారమా?రాజకీయ కార్యక్రమాలను వార్తలుగా ప్రచురించడం మీడియా బాధ్యతలో భాగమే. కానీ వార్తకు, ప్రచారానికి...