జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగుల దుమారం. <br>-కాంగ్రెస్‌పై మండిపడుతున్న అభ్యర్థులు.

జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగుల దుమారం. -కాంగ్రెస్‌పై మండిపడుతున్న అభ్యర్థులు. జనం వాయిస్,హైదరాబాద్‌,అక్టోబర్‌ 31:రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్న నిరుద్యోగులు ఇప్పుడు రాజకీయ పోరాటానికి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆగ్రహంతో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో నిరుద్యోగులు బరిలోకి దిగారు.ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది నిరుద్యోగ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరంతా తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు."నిరుద్యోగులకు ఆశలు చూపి నిలువునా మోసం చేశారు," అని చెబుతూ, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి తగిన...