మంచిర్యాల ఎగ్జిబిషన్‌లో ‘కాశ్మీర్ జలకన్య’ దోపిడీ.!
మంచిర్యాల ఎగ్జిబిషన్‌లో 'కాశ్మీర్ జలకన్య' దోపిడీ.! టికెట్ ధర అడిగితే నిర్వాహకుల దురుసుతనం. సామాన్యుల జేబులకు చిల్లులు. అనుమతులు లేకున్నా ఇష్టారాజ్యంగా వసూళ్లు.. తనిఖీలు చేపట్టాలని డిమాండ్. జనం వాయిస్, మంచిర్యాల ప్రతినిధి, మే 22: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో నిఘా నిద్రపోతుండటంతో కొందరు నిర్వాహకులు నిలువు దోపిడీకి తెరలేపారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో "కాశ్మీర్ జలకన్య" పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ సామాన్య ప్రజలను దగా దండుకుంటున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అంతా తెలిసినా...