Date of Publish : 05 May 2026, 3:38 pmDigital Edition : JANAM VOICE
పాలమూరు నుంచే తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవితమ్మ తొలి అడుగు.
పాలమూరు నుంచే తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవితమ్మ తొలి అడుగు.
– కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి.
– 8న రంగా రెడ్డి జిల్లా చౌదరిగూడెం వద్ద పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ.
– రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి.
జనం వాయిస్, రంగారెడ్డి, మే 05:
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి, ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు గడ్డ మీది నుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ప్రకటించిన కల్వకుంట్ల కవితమ్మ అన్నట్టుగానే ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారని అన్నారు. 8న ఉదయం జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని కవితమ్మ అదే రోజు సాయంత్రం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు అని తెలియజేశారు. తెలంగాణ రక్షన సేన (టీఆర్ఎస్) పార్టీ స్థాపించిన తర్వాత తన మొదటి ప్రాధాన్యతగా కృష్ణా జలాల సాధనకు శ్రీకారం చుట్టారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి పాలకుల లోపభూయిష్ట విధానాలే కారణమని పలు వేదికలపై నుంచి కవితమ్మ స్పష్టం చేశారని అన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన బీళ్లకు మళ్లించుకునేందుకు తమ వద్ద స్పష్టమైన విధానాలు ఉన్నాయని వారు ప్రకటించారు. ఈ క్రమంలోనే కృష్ణా నీళ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 11 ఏళ్లు గడిచిన తర్వాత కూడా 50 పనులు పూర్తి చేయకపోవడంపై ‘‘జనంబాట’’ కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టుకు సత్వర అనుమతులు సాధించడంతో పాటు పనులు వేగంగా పూర్తి చేయించడానికి ఉద్యమ ప్రణాళిక ప్రకటించే దిశగా కవిత అడుగులు వేస్తున్నారని తెలంగాణకు హక్కుగా దక్కే ప్రతి చుక్క నీటిని మన బీడు భూములకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని పాండురంగా రెడ్డి అన్నారు.