పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కవిత.
యశోద ఆస్పత్రిలో ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 29:
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్యం, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన కవిత, చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. వైద్య బృందం అందిస్తున్న సేవలను గురించి కూడా ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెబుతూ, ఆయన త్వరగా కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తనతో కలిసి ఉద్యమంలో పనిచేసిన సహచరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆయన త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు కవిత భరోసా కల్పించారు. ప్రస్తుతం ఆయనకు యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.