janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 8:34 pm Digital Edition : GATTU MAHESH

కవిత కోసం రంగంలోకి పీకే!

కవిత కోసం రంగంలోకి పీకే!

జనం వాయిస్, వెబ్ డెస్క్:

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కవిత కొత్త పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీకేతో కవిత సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి కూడా వీరిద్దరు సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కవిత, జాగృతి ప్రతినిధులు కానీ ప్రకటించలేదు