janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 3:13 pm Digital Edition : JANAM VOICE

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..!!

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..!!

– కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.

జనం వాయిస్, మహాదేవపూర్:

తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ సాధకుడు ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల శివ అన్నారు.. జన్మదిన పురస్కారంలో భాగంగా కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆకుల శివ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు. కేసీఆర్‌ చేసిన  అభివృద్ధి పనులు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థిరస్థాయిగా ఉంటాడని.. గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సాధించిన కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని.. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కేశవ్, సలహాదారులు బందేల వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రత్న రాజిరెడ్డి, నాగుల తిరుపతి, బస్వ సతీష్, రత్న సాంబం, కుంభం రమేష్, భూపెళ్లి రవితేజ, మందుట నరేష్, ప్రశాంత్, సాయి, విష్ణు, కొయ్యల రాజబాబు, అంజి, సత్యం మరియూ బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.