ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.-తల్లిదండ్రులకు వాట్సాప్‌లో హాల్‌టికెట్లు.

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.- తల్లిదండ్రులకు వాట్సాప్‌లో హాల్‌టికెట్లు…జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 02: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపించాలని బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, పరీక్షలకు దాదాపు రెండు నెలల ముందే ఈ హాల్‌టికెట్లు పంపించనున్నారు. హాల్‌టికెట్లు ముందుగానే తల్లిదండ్రులకు అందితే, వాటిలో ఉన్న పేరు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, పరీక్షల...