గూడ్స్ రైలు డీ కొని కీ మెన్ మృతి.
గోదావరిఖని, జులై 05, (జనం వాయిస్):
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అక్బర్ నగర్ కి చెందిన జగబంధు, సాగర్ (41) రామగుండం రైల్వే కాలనీ నివాసి రామగుండం రైల్వే స్టేషన్ పరిధిలో
పెద్దపల్లి స్టేషన్ ట్రాక్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం తెల్లవారు జామున 5:40 గంటలకు జగ బంధు సాగర్ విధులు కు హాజరు అయ్యేందుకు ఇంటి నుండి బయలుదేరాడు. శనివారం 11 గంటలకు రామగుండం మండలం కుందన్ పల్లి లో పాయింట్ నెంబర్ 62.సమీపం లో జగ బంధు సాగర్ తన విధులు నిర్వహిస్తుండగా షీటింగ్ ఆపరేషన్ చేస్తుండడం తో ప్రమాదవశాత్తు ఘటన లో రైలు కదలడం తో సాగర్ పై నుంచి వెళ్లింది ఈ ఘటనలో సాగర్ బాడి రెండు భాగాలు గా విడిపోయింది. వెంటనే తోటి కార్మికులు గమనించి రైల్వే పై లెట్ కి సమాచారం అందించారు.రైలు ను నిలిపివేసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.ఆర్ పీ ఎఫ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలు ను సేకరించారు.సాగర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని( ఆర్ పి ఎఫ్) పోలీసులు తెలిపారు.