janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 10:55 pm Digital Edition : JANAM VOICE

‘ప్యారడైజ్’లోని శంకరన్న పాత్రపై కేటీఆర్ ప్రశంస.. ‘రామన్న’ ప్రేమకు రుణపడి ఉంటాన‌న్న‌ ప్రియదర్శి

‘ప్యారడైజ్’లోని శంకరన్న పాత్రపై కేటీఆర్ ప్రశంస.. ‘రామన్న’ ప్రేమకు రుణపడి ఉంటాన‌న్న‌ ప్రియదర్శి

‘ప్యారడైజ్’ సినిమాపై ప్రశంసలు కురిపించిన కేటీఆర్.
నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను అభినందించిన బీఆర్ఎస్ నేత.
ప్రియదర్శి నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్న కేటీఆర్.
తన సినిమాలపై చూపిస్తున్న ప్రేమకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రియదర్శి.

జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 27:

నాని ‘ప్యారడైజ్’ సినిమాపై, అందులో ప్రియదర్శి నటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ అభినందనలకు ప్రియదర్శి కృతజ్ఞతలు తెలుపుతూ స్పందించారు. వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించిన కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఆత్మగౌరవ పోరాటం, అణచివేతపై తిరుగుబాటు. అవసరమొస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారతాయని సందేశాన్నిచ్చిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెలకు మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రధాన పాత్రలో జీవించిన మిత్రుడు నానికి శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు” అని కేటీఆర్ పోస్ట్ చేశారు. కేటీఆర్ ప్రశంసలపై ప్రియదర్శి స్పందిస్తూ.. “పెళ్లిచూపుల నుంచి ప్యారడైజ్ వరకు నా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీకు నేను రుణపడి ఉంటాను రామన్నా” అని బదులిచ్చారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రియదర్శి ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్రను పోషించారు. ఈ పాత్ర ఆహార్యం, హావభావాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, ఇది తెలంగాణలో తన అనుభవాల ఆధారంగా అల్లుకున్న కల్పిత కథ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శంకరన్న పాత్రను కేటీఆర్ ప్రత్యేకంగా మెచ్చుకోవడం సినిమాపై రాజకీయ చర్చను మరింత పెంచింది.