janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 7:26 pm Digital Edition : GATTU MAHESH

కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందన.

కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందన.

– మున్సిపల్ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు.
– జాగృతి అభ్యర్థులపై కవిత ప్రకటన.
– స్పందన అవసరం లేదన్న కేటీఆర్.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాచరికపు పోకడలకు, నియంతృత్వానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేసినా కారు గుర్తుకు ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారని ఆమె పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో గుణం, పనితీరు చూసి ఓటు వేయాలని కవిత సూచించారు. మంచి పనులు చేసే అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని, చెడ్డ అభ్యర్థులకు ఓటు వేయాలని కేటీఆర్ చెప్పడం సరికాదని ఆమె ప్రశ్నించారు. జాగృతి తరపున పోటీ చేసే అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై బరిలో నిలుస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, ఆమెపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తగిన చర్యలు తీసుకుందని చెప్పారు. కవిత వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పరంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో రోజూ అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తుంటారని కేటీఆర్ అన్నారు. ప్రతి వ్యక్తి చేసిన ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని, అవసరమైన చోట మాత్రమే స్పందిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన సూచించారు.