రేపటి నుంచి తెలంగాణలో పెరుగనున్న భూముల ధరలు!
జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 04:
తెలంగాణలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లో కి వస్తాయని తెలంగా ణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. భూముల విలువల సవరణ శాస్త్రీయంగా హేతు బద్ధంగా చేపట్ట మన్నారు.
క్షేత్రస్థాయి అధ్యయ నం మార్కెట్ పరిస్థి తుల మేరకు కొత్త విలువలు ఉన్నాయ న్నారు. నిపుణుల సూచనలు అధికారుల సలహాలతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు చెప్పారు ప్రాంతాల వారీగా మార్కెట్ ధరలు రిజిస్ట్రేషన్లు పరిశీలించామన్నారు.
వాస్తవ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉండడం వల్ల భూ లావాదేవీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమ య్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పరిస్థితులను సరి దిద్దేందుకు రాష్ట్రం లోని 144 సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునఃసమీక్ష చేశామని వివరించారు.
ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల లావాదేవీ లు, వేలంపాటలు, డిమాండ్, కొత్త రహదారులు, కారిడార్లు, ఓఆర్‌ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశా లను పరిగణనలోకి తీసుకొని విలువలను నిర్ణయించినట్లు తెలిపారు.
ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాం టి పెంపు ప్రతిపాదించ లేదని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ క్యూర్, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూము లు, ఫ్లాట్లు, ప్లాట్లకు కనీస ప్రాథమిక ధరల నూ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.