తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.
తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం. జనం వాయిస్, తిరుమల, జూలై 11: తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేఇంది. చిరుత తిరుగుతుందని భయంతో భక్తులు పరుగులు తీసారు. తిరుమల అలిపిరి నడకమార్గంలోని శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం రాత్రి భక్తులకు చిరుతపులి కనిపించింది. భక్తులు పరుగులు తీయడంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా, అటవీశాఖ సిబ్బంది భక్తులను సురక్షితంగా తరలించారు.