janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 8:52 am Digital Edition : GATTU MAHESH

మాదిగ జాగృతి జిల్లా కార్యవర్గం నియామకం.

మాదిగ జాగృతి జిల్లా కార్యవర్గం నియామకం.

జనం వాయిస్, పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లాలో ధర్మసమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గాను మాదిగ జాగృతిని పటిష్టం చేస్తూ, ఆదివారం జిల్లా కమిటీని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్ మహారాజ్ ఆధ్వర్యంలో సమావేశం అనంతరం ఎన్నుకున్నారు. మాదిగ జాగృతి జిల్లా అధ్యక్షునిగా ఎదుల్ల శంకరయ్య, జిల్లా ఉపాధ్యక్షునిగా ఆవునూరి సతీష్, ప్రధాన కార్యదర్శిగా మాతంగి రేవంత్, కార్యదర్శిగా బూడిద మహేందర్, ఆరేపల్లి జైకర్ బాబు, కోశాధికారిగా రమాకాంత్, కమిటీ సభ్యులుగా ఖ్యాదాసి రమేష్, కుక్క అవినాష్, ఆషాడం ముఖేష్, ఆషాడం విక్రమ్, సతీష్ తదితరులు నియామకమయ్యారు. ఈ సందర్భంగా, ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్ మహారాజ్ మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలో ధర్మసమాజ్ పార్టీని బలోపేతం చేసేందుకు గాను మాదిగ జాగృతిని ఏర్పాటు చేసి తద్వారా, గ్రామాలలో మళ్లీ పూర్వ వైభవానికి కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు. ఉద్యోగులు విద్యావంతులు యువత నాయకులు అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో మాదిగ జాగృతిని గ్రామాల వారిగా బలోపేతం చేసి మండల కమిటీ ద్వారా జిల్లాలో బలమైన శక్తిగా నిలిపేందుకు నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లందరినీ కలుపుకొని బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రీకాంత్ మహరాజ్ సమావేశంలో సూచించారు. ఈ సందర్భంగా మాదిగ జాగృతి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన ఎదుల్ల శంకరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఆవునూరు సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాతంగి రేవంత్ మాట్లాడుతూ గతంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ ఏ విధంగానైతే సాంస్కృతిక ఉద్యమం గా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ధర్మసమాజ్ పార్టీని ఏర్పాటు చేసి అందులో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని, తిరిగి మాదిగ జాగృతి ద్వారా బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని, మాపై నమ్మకంతో పదవులు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.