శబరిమలలో మకరజ్యోతి దర్శనం.
శబరిమలలో మకరజ్యోతి దర్శనం.జనం వాయిస్, శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. పొన్నాంబలమేడు పైనుంచి మూడు సార్లు జ్యోతి దర్శనమిచ్చింది. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి.