janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 3:45 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం విజయవంతం చేయండి.

తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం విజయవంతం చేయండి.

జనం వాయిస్, మంథని, జులై 20:

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలే పరిష్కార ధ్యేయంగా ఉద్యమకారులు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంథని పట్టణానికి చెందిన డాక్టర్ కావటి సతీష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల సంఘం ఇన్చార్జిగా పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 16న ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆత్మీయ సమ్మేళ నిర్వహించి, ఉద్యమ కార్యచరణ ప్రకటించబోతున్నట్లుగా పిడమర్తి రవి తెలిపారని సతీష్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని వారు తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి, మేనిఫెస్టో చైర్మన్  శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో 1969,  2009 ఉద్యమం లో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారులను సెప్టెంబర్ 16న నిర్వహించే అపూర్వ సమ్మేళనము కు ఆహ్వానించి గౌరవిస్తామని తెలిపారు.