మంథని మండలంలో విషాదం..
– మల్లారం సర్పంచ్ భర్త గుండె పోటుతో మృతి.
జనం వాయిస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లారం గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది.ఇటీవలే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పొట్ల లక్ష్మి భర్త పొట్ల వెంకటి గుండె పోటుతో మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మంథని మండలం మల్లారం గ్రామ సర్పంచ్ పొట్ల లక్ష్మీ భర్త వెంకటి హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండేటువంటి వెంకటి మృతి చెందడం పట్ల గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సర్పంచ్ గా పొట్ల లక్ష్మీ గెలవడంలో భర్త వెంకటి కీలకపాత్ర పోషించారు. పొట్ల వెంకటి సింగరేణి ఉద్యోగి.