‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్..
జనం వాయిస్, సినిమా:
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి భారీ అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కుటుంబ వినోద చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో తిరుపతిలోని ఎస్‌వీ సినీప్లెక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొననుండగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. శంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి కనిపించనుండగా, నయనతార ఆయన సరసన నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో మెరవడం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా మారింది.
దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో హాస్యం, భావోద్వేగాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.