- కలెక్టర్ ను కలిసిన మంథని మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్.
జనం వాయిస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీకీ నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి లు శనివారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ని మరియు అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ లను కలిశారు.ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ లకు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లు అభినందనలు తెలిపారు. మంథని మున్సిపాలిటీ అభివృద్ధికై పాలకవర్గానికి సహకరించాలని ఈ సందర్బంగా చైర్మన్, వైస్ చైర్మన్ వారిని కోరారు. పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు.