మంథని గోదావరిలో యువకుడు గల్లంతు.
జనం వాయిస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది.మంథని గోదావరినదిలో స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు.మంథని పట్టణానికి చెందిన సాయి కృష్ణ (32) అనే యువకుడు సోమవారం ఉదయం గోదావరి నది స్నానానికి వెళ్ళాడని ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు వచ్చి చూడగా బట్టలు చెప్పులు ఫోన్ గోదావరి ఒడ్డున కనపడ్డట్లు తెలిపారు..కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగ మంథని పోలీసులు గోదావరి వద్దకు చేరుకొని అగ్నిమాపక రెస్క్యు టీం తో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
