janamvoice.com
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 6:11 pm Digital Edition : JANAM VOICE

గుండెపోటుతో మంథని సింగిల్ విండో సీఈవో మృతి.

గుండెపోటుతో మంథని సింగిల్ విండో సీఈవో మృతి.

జనం వాయిస్, మంథని, జూలై 7 :

మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) మామిడాల అశోక్ (48) గుండెపోటుతో ఆకస్మికంగా మంగళవారం మృతి చెందారు. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అశోక్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కార్యాలయం సిబ్బంది మంథనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. మామిడాల అశోక్ 2009 సంవత్సరం నుంచి మంథని సింగిల్ విండో కార్యాలయంలో సేవలందిస్తూ ఇటీవల ముఖ్య కార్యనిర్వహణ అధికారి గా పదోన్నతి పొందారు.  అశోక్ స్వగ్రామం  పోత్కపల్లి. ప్రస్తుతం ఉద్యోగరీత్యా మంథనిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ ఆకస్మిక మృతి పట్ల మంథని సింగిల్ విండో అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, డైరెక్టర్లు, సంఘం ఉద్యోగులు,  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ  సంతాపం తెలిపారు