నూతన జంటకు వంట సామాగ్రి అందజేత.
జనం వాయిస్,మంథని:
చేయూత మంత్రపురి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంథని మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన నూతన జంటకు మంగళవారం వంట సామాగ్రి ని అందించారు. మంథని పట్టణానికి చెందిన 1989 — 90 సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ వారు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నూతన జంటకు వంట సామాగ్రిని అందించారు. చేయూత మంత్రపురి సంస్థ ద్వారా తమకు వంట సామాగ్రిని అందించిన పట్ల నూతన దంపతులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమములో సంస్థ సభ్యులు కోటయ్య, నన్నే గారి రాము, కొమురోజు మధు, పెండం నరేందర్, తోట సత్యం, మంథని లింగయ్య తదితరులు పాల్గొన్నారు.