janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 12:27 pm Digital Edition : JANAM VOICE

రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫా.

రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫా.

  • ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత.

గోదావరిఖని, సెప్టెంబర్ 23 (జనం వాయిస్):

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎండీ ముస్తఫాను నియమించారు. ఈ మేరకు బుధవారం గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ముస్తఫా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ ముస్తఫా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచిన తనను గుర్తించి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తతో కలిసి సమన్వయంతో పనిచేస్తానన్నారు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని తెలిపారు. ఇప్పటివరకు కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బొంతల రాజేష్ స్థానంలో ఎండీ ముస్తఫాను నియమించారు. రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన ముస్తఫాకు పార్టీ బాధ్యతలు అప్పగించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ఎండీ ముస్తఫా కృతజ్ఞతలు తెలిపారు.