janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 11:26 am Digital Edition : GATTU MAHESH

మేడారం జాతర.. మాంసానికి రూ.400 కోట్లు.!

మేడారం జాతర.. మాంసానికి రూ.400 కోట్లు.!

జనం వాయిస్, మేడారం:

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన మేడారం జాతరలో భక్తులు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. కోటిన్నర మంది భక్తులు హాజరుకాగా, 14 లక్షల మేకలు, గొర్రెలను బలిచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క మద్యం కోసమే రూ.10 కోట్లు, మాంసం-మద్యం కలిపి రూ.400 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. వీటితో పాటు కోటికి పైగా కొబ్బరికాయలు, 500 టన్నుల బెల్లం విక్రయాలు జరిగాయి.