నన్ను ఆశీర్వదించి ఓటెయ్యండి.
-గ్రామ అభివృద్ధికై కృషి చేస్తా.
-సుద్దాల రెండవ వార్డు అభ్యర్థి మేడి దేవేందర్.
జనం వాయిస్, పెద్దపల్లి:
స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ వార్డ్ అభ్యర్థి మేడి దేవేందర్ భారీగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండవ వార్డు అభ్యర్థి మేడి దేవేందర్ మాట్లాడుతూ.. నన్ను ఆశీర్వదించి ఓటెయ్యండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, సుద్దాల గ్రామంలో రెండవ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా నన్ను స్టూలు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్ల ను అభ్యర్థించారు. గెలిచిన అనంతరం గ్రామం కోసం నేను చేసే అభివృద్ధి పనులు..సీసీ రోడ్లు, యువత కోసం లైబ్రరీ, డ్రైనేజీ వ్యవస్థ, రెండవ వార్డ్ లో వినాయక మండపo మరియు గద్దె నిర్మాణం, ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ వాటర్, వీధిలైట్ల సమస్యలు, లేకుండా చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వాగ్దానం చేశారు.