మాదాడి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
జనం వాయిస్, మంథని, సెప్టెంబర్ 17:
మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది మాదాడి ప్రభాకర్ రెడ్డి సతీమణి మాణిక్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాణిక్యమ్మ మృతికి మంత్రి శ్రీధర్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.