అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.
– ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం.
జనం వాయిస్, మంథని:
మంథని పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరై తన చేతుల మీదుగా ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమం ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని ఆర్యవైశ్య సంఘ సోదరులు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బస్సులను అందుబాటులో ఉంచాలని డిపో మేనేజర్ కు తెలిపారు. బస్టాండ్ లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు గురించి తెలుసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.