గోదావరిఖనిలో మంత్రి వివేక్ పర్యటన.
గోదావరిఖనిలో మంత్రి వివేక్ పర్యటన.- సింగరేణి ఆసుపత్రిలో రోగిని పరామర్శ. - మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం. - నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు.జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్ 15: గోదావరిఖనిలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు.సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయశ్రీని మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలంటూ వైద్యులకు సూచించారు.రోగులకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత...