Date of Publish : 20 February 2026, 10:37 amDigital Edition : JANAM VOICE
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు.
జనం వాయిస్, గోదావరిఖని:
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.