తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు. జనం వాయిస్, గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.