సింగరేణి ఆర్జీ-3 రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ పై విజిలెన్సు కి ఫిర్యాదు చేస్తాం.
-జిల్లా ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్.
జనం వాయిస్,పెద్దపల్లి:
సింగరేణి ఆర్జీ-3 ఏరియా లోని రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ పై విజిలెన్సు కి ఫిర్యాదు చేస్తామని జిల్లా ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్ తెలిపారు.సింగరేణి లో ఎక్కడ లేని విధంగా రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ కు ఈఏండి రూ.95,370 ఏర్పాటు చేశారని అన్ని ఏరియాలలో ఈఎండి లేకుండా టెండర్లు పిలుస్తున్నా,ఆర్జీ-3 డివిజన్ లో ఈఎండి ఏర్పాటు చేసి రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ ను పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ టెండర్ లో 152 మంది పాల్గొన్నారని,ఏక్కడ లేని విధంగా ఆర్జీ-3 లో ఈఎండి ఏర్పాటు చేసి టెండర్ పిలవడం పై విజిలెన్సు కు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.అదే విధంగా రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ ను రద్దు చేసి తిరిగి ఈఎండి లేకుండా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.టెండర్ డ్రా తీసి సుమారు రెండు నెలలు పూర్తి అయిన ఈఏండి ని ఇంత వరకు కాంట్రాక్టర్ లకు తిరిగి చెల్లించలేదు.రూ.కోటి 50 లక్షల డబ్బులను సింగరేణి సంస్థ వద్ద మూడు నెలలు ఉన్నాయి.సింగరేణి నిబంధన ప్రకారం టెండర్ డ్రా తీసిన మరుసటి రోజు ఈఎండి ని తిరిగి చెల్లించాలి.కానీ ఇప్పటివరకు ఈఎండి చెల్లించలేదని అన్నారు.