అత్తమ్మ సర్పంచ్ గా గెలుపు.. మొక్కులు చెల్లించుకున్న అల్లుడు.
– బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు పల్లె అభిలాష్.
జనం వాయిస్, ధర్మారం:
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామ సర్పంచ్ గా మూల మంగ మల్లేశం గెలవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు పల్లె అభిలాష్ గౌడ్ మేడారం సమ్మక్క సారక్క కు మొక్కుకున్నారు. మూల మంగ మల్లేశం గౌడ్ రామయ్యపల్లి సర్పంచ్ గెలిచిన సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు పల్లె అభిలాష్ కుటుంబ సభ్యులతో వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మూల మంగ మల్లేశం, రైతు బంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు పాకాల రాజయ్య, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మార్క బాలయ్య, కుటుంబ సభ్యులు ఉన్నారు.