క్రికెట్ ఆడొద్దని తల్లి మందలింపు..తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.

క్రికెట్ ఆడొద్దని తల్లి మందలింపు..తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య. జనం వాయిస్, మంచిర్యాల:మంచిర్యాల జిల్లా దండేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న న్యాలం ఆకర్ష్‌ (14) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల ప్రకారం.. క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లొద్దని, హోంవర్క్ చేసుకోవాలని తల్లి శ్రీదేవి బాలుడిని మందలించారు. ఈ మందలింపును తీవ్రంగా తీసుకున్న ఆకర్ష్ క్షణికావేశానికి లోనై ఇంట్లోని బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎంతోసేపటికీ తలుపులు...