janamvoice.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:42 pm Digital Edition : JANAM VOICE

ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.

  • ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.
  • -యువతపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి.
  • -డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్.
  • జనం వాయిస్, మంథని:
  • డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ  ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి  కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ను మంథని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ పోరాటాలను అరెస్టులతో ఆపాలేరని  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి  మూడు సంవత్సరాల కాలం గడిచిన  ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి  రూ.4000 ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని క్రీడ రంగానికి 1000 కోట్ల నిధులు విడుదల చేసి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం యువతకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక యువతను పూర్తిగా మరిచిపోయిందని, అనేకమంది యువత చదువుకొని నిరుద్యోగులుగానే ఉన్నారని అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను లేక యువత మత్తుకు బానిసలు అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.