గోదావరిఖనిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మైసమ్మ ఆలయాల ధ్వంసం.

గోదావరిఖనిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మైసమ్మ ఆలయాల ధ్వంసం.-తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.జనం వాయిస్,గోదావరిఖని:గోదావరిఖని పట్టణంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా,సుమారు 48 మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడం పట్ల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది భక్తుల విశ్వాసాన్ని అవమానపరచే చర్యగా మాత్రమే కాకుండా,స్థానిక ప్రజల సాంస్కృతిక,ఆధ్యాత్మిక విలువలను తాకే దురదృష్టకర సంఘటనగా పరిగణించాలన్నారు.ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోకుండా,సాంప్రదాయంగా పూజించబడుతున్న దేవాలయాలను ధ్వంసం చేయడం పూర్తిగా అన్యాయమన్నారు.ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు...